ఆదిపురుష్ డైరెక్టర్ కు లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత

ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ కు ఖరీదైన లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాత భూషణ్ కుమార్. బాహుబలి , సాహో , రాధే శ్యామ్ చిత్రాలతో నార్త్ లోను సత్తా చాటిన ప్రభాస్..ఇప్పుడు ఆదిపురుష్ అంటూ రామాయణ కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్.

భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు అనే విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఇదిలా ఉంటె..దర్శకుడు ఓం రౌత్ కు ఓ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాత భూషణ్ కుమార్. సుమారు రూ. 4.02 కోట్ల విలువ చేసే ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కారును ఆదిపురుష్ దర్శకుడు గిఫ్ట్ గా అందుకున్నాడు. గతంలోనూ నిర్మాత భూషణ్ పలువురు సినిమా తరాలకు ఖరీదైన కారులను గిఫ్ట్ గా ఇచ్చారు.