అనారోగ్యానికి గురైన పాయల్ రాజ్ పుత్
RX100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ అనారోగ్యానికి గురైంది. ఈ మధ్య హీరోయిన్లు వరుసగా అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలు చేస్తూ..రెస్ట్ లేకుండా షూటింగ్ లతో గడిపేయడం తో రకరకాల అనారోగ్యాల బారినపడుతున్నారు. ఈ క్రమంలో పాయల్ సైతం అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. పాయల్ రాజ్ ప్రస్తుతం కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు సమాచారం.
కొద్ది రోజులుగా ఈ వ్యాధితో బాధపడుతూ, ఇంట్లో చికిత్స తీసుకుంటున్నట్లు స్వయంగా ఆమెనే తెలిపింది. ఇంట్లోనే సెలైన్ పెట్టుకున్నా ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ హెల్త్ పై అప్డేట్ అందించింది. ఈ మేరకు ఓ నోట్ కూడా రాసుకుంది. నేను చాలా తక్కువ నీరు తాగేదాన్ని. దాంతో కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది. ఫలితంగా కాస్త అనారోగ్యానికి గురయ్యాను. ప్రస్తుతం ట్రీట్మెంట్ ముగిసింది. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నాను. మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈమె RX100 డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్లో మంగళవారం అనే సినిమా చేస్తుంది. హారర్ టచ్ ఉన్న జోనర్లో ఈ కథ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. స్వాతి – సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.