భీమ్లా నాయక్ రన్ టైం ఎంతో తెలుసా..?

భీమ్లా నాయక్ రన్ టైం ఎంతో తెలుసా..?

సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ లతో పాటు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ కూడా రంగంలోకి దిగబోతుంది. ఈ సినిమా వాయిదా పడొచ్చు అనే ప్రచారం జరుగుతున్నప్పటికీ..ఎప్పటికప్పుడు సినిమాను జనవరి 12 న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ చెప్పుకొస్తూనే ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను స్పీడ్ చేశారట. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

అదే సినిమా రన్ టైం.. సినిమాలో ఐటమ్ నంబర్స్ కానీ డ్యూయెట్స్ కానీ లేకపోవడంతో రన్ టైమ్ ని 2 గంటల 20 నిమిషాలకు లాక్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారట. అంతే కాకుండా ఇలా రన్ టైమ్ ని లాక్ చేయడం వల్ల సినిమా ఎలాంటి లాగ్ లేకుండా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని అది సినిమాకు మరో ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. దాదాపు ఇదే ఖరారు అన్నట్లు చెపుతున్నారు.

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. సాగర్ వి. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ప్లే అందించారు. రానా దగ్గుబాటి తొలి సారి పవర్ స్టార్ తో కలిసి వర్క్ చేసిన సినిమా ఇది. నిత్యామీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్ లు గా నటించారు. థమన్ మ్యూజిక్.