రేపు వైజాగ్ లో గ్రాండ్ గా అఖండ సక్సెస్ మీట్ ..

రేపు వైజాగ్ లో గ్రాండ్ గా అఖండ సక్సెస్ మీట్ ..

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది..బాక్స్ ఆఫీస్ కు సరికొత్త సినీ కళను తీసుకొచ్చింది. విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో కుమ్మేస్తుంది. ఈ తరుణంలో ‘అఖండ విజయోత్సవ జాతర’ పేరిట గ్రాండ్​ సక్సెస్​ మీట్​ ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. విశాఖపట్నంలోని వుడా పార్క్​ ఎమ్​జీఎమ్​ గ్రౌండ్స్​లో గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్​ ప్రారంభం కానుంది. అయితే ఈ వేడుకకు సూపర్​స్టార్ మహేశ్​బాబు, యంగ్​టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.