యాపిల్ సీఈవో టిమ్ కుక్ వార్షిక వేతనం తగ్గింది

శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ వార్షిక వేతనం గతేడాది కాస్త తగ్గింది. 2018లో కుక్ 15.7 మిలియన్ డాలర్ల వేతనం తీసుకోగా..2019 సంవత్సరానికి గానూ 11.6 మిలియన్ డాలర్లు మాత్రమే అందుకున్నారు. 2018తో పోలిస్తే గతేడాది యాపిల్ పర్‌ఫార్మెన్స్ తగ్గడంతో టిమ్ కుక్ వేతనంలో కోత పడింది. గతేడాది గానూ టిమ్ కుక్ 3 మిలియన్ డాలర్ల మూలవేతనం అందుకోగా..7.7 మిలియన్ డాలర్లు ప్రోత్సాహక బోనస్ కింద తీసుకున్నారు. యాపిల్ పనితీరుపై ఆధారపడి ఈ బోనస్ ఇస్తుంటారు. 2018లో కంపెనీ విక్రయాలు అనుకున్న లక్ష్యానికంటే రెట్టింపవడంతో టిమ్ కుక్ 12 మిలియన్ డాలర్లు బోనస్ రూపంలో అందుకున్నారు. అయితే గతేడాది ఈ విక్రయాలు 28 శాతం మాత్రమే పెరగడంతో సీఈవో బోనస్‌ను తగ్గించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/