‘బీస్ట్’ ట్రైలర్ రిలీజ్

తమిళ స్టార్ హీరో విజయ్ – పూజా హగ్దే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘బీస్ట్’. ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో ఊపందుకున్నాయి. ఈరోజు ఉగాది సందర్బంగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

ఇందులో విజయ్ గెటప్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉన్న ట్రైలర్​లోని ప్రతి ఫ్రేమ్​అదుర్స్​ అనిపించేలా ఉంది. విజయ్​ను మరో లెవల్​లో చూపించారు దర్శకుడు. ‘రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని’ అన్న డైలాగ్​ ట్రైలర్​కు హైలెట్​గా నిలిచింది. దీంతో పాటు ఈ ట్రైలర్‌లో మ్యూజిక్‌ను అనురుద్‌ ఇరగదీశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా హీరో శివకార్తికేయన్ రచించిన ‘అరబిక్ కుతు’ పాటకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ లభిస్తోంది

. https://www.youtube.com/embed/0E1kVRRi6lk