మెక్సికో సోయగానికి ‘మిస్ యూనివర్స్’

‘మిస్ యూనివర్స్’ ను దక్కించుకున్న మూడవ మెక్సికన్‌గా రికార్డు

మనప్రవర్తన కూడా మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది.మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దు. అంటూ ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది

Andrea Meja(Mexico) Wins 'Miss Universe'
Andrea Meja(Mexico) Wins ‘Miss Universe’

Florida: మెక్సికో సోయగం ఆండ్రియా మెజా (26) మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని చేజిక్కించుకుంది. తాజాగా ఫ్లోరిడాలో 69వ మిస్ యూనివర్స్ తుది పోటీలో విజయంతో ‘విశ్వ సుందరి ‘గా నిలిచింది. 73 మందిని దాటుకుని ఈ టైటిల్ సాధించింది. ‘మిస్ యూనివర్స్’ ను దక్కించుకున్న మూడవ మెక్సికన్‌గా నిలిచింది. మన ప్రవర్తన కూడా మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది.మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దు అంటూ ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది. తొలి రన్నరప్‌గా మిస్‌ బ్రెజిల్‌ జులియా గామా, ద్వితీయ రన్నరప్‌గా మిస్‌ పెరూ జానిక్‌ మెసెటా డెల్‌ కాసిలో నిలిచారు. మిస్‌ ఇండియా అడెలిన్‌ కాస్టెలినో టాప్‌-5లో స్థానంకు పరిమితం అయింది. ఇదిలా ఉండగామహిళా హక్కుల కోసం, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మెజా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అందుకుంది.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/investigation/