ఐటీ దాడుల నేపథ్యంలో ఉద్యోగులకు బీబీసీ పలు సూచనలు

నిన్నటి నుండి బీబీసీ ఆఫీసుల ఫై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం మొదలైన సోదాలు..ఈరోజుకు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో తమ ఉద్యోగస్తులకు బీబీసీ పలు సూచనలు తెలుపుతూ లేఖ పంపింది. అవసరమైన వారు.. అంటే బ్రాడ్ కాస్ట్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే వారు మినహా మిగతా వారు ఆఫీసుకు రానవసరం లేదని తెలిపింది. ఇంటి వద్ద నుంచే పనిచేయాలని మెయిల్ లో సూచించింది.

ఐటీ అధికారుల సోదాలకు సహకరించాలని మరోమారు సూచించింది. జీతానికి సంబంధించిన వివరాలను అడిగితే చెప్పాలని పేర్కొంది. అయితే, వ్యక్తిగత ఆదాయ వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరంలేదని సూచించినట్లు తెలుస్తోంది. కాగా, పన్ను ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతోనే బీబీసీ ఆఫీసుల్లో సర్వే చేస్తున్నట్లు ఐటీ అధికారులు మంగళవారం వెల్లడించారు.

పలు అంశాలకు సంబంధించి సంస్థ లెక్కల్లో చూపించిన ఖర్చులపై సందేహాలు ఉన్నాయని అన్నారు. వాటిని నివృత్తి చేసుకోవడానికి బీబీసీ అకౌంట్స్ బుక్స్ ను, బ్యాలెన్స్ షీట్ తదితర అకౌంట్స్ వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలిపారు.