మూడో రోజు కూడా కొనసాగుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

basara-iiit-student-protest-will-continue 3rd day

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన మూడో రోజుకు చేరింది. విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ బుధవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి విద్యార్థులు యథావిధిగా కాలేజీలో తరగతులకు హాజరవుతారని చెప్పుకొచ్చారు. కానీ బాసర ట్రిపుల్ ఐటీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. విద్యార్థులు రాత్రి వానలో తడుస్తూనే తమ నిరసన కొనసాగించారు. ఈరోజు గురువారం కూడా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే దాకా ఆందోళన కొనసాగిస్తామ‌ని తెలిపారు విద్యార్థులు. ట్విట్టర్ ద్వారా మంత్రులు చేసిన రిక్వెస్ట్‌ను స్టూడెంట్స్ తిరస్కరించారు.

నిన్న రాత్రి భారీ వర్షంలోనూ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోపక్క విద్యార్థుల ఆందోళనకు మద్ధతు పెరుగుతోంది. విద్యార్థి సంఘాల నాయకులతో పాటు.. రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ చీఫ్ , ఇతర పార్టీల నేతల సంఘీభావం ప్ర‌క‌టించారు. గురువారం ఉదయం కూడా విద్యాలయం గేట్ వద్ద విద్యార్థులు బైఠాయించి ఆందోళనకు దిగుతున్నారు. మూడో రోజూ కూడా ప్రశాంతంగా తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. మరోపక్క విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డలా ఆరోగ్యం ఏమవుతుందో అని ఆవేదన వ్యక్తం చేస్తూ , ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.