బిగ్ బాస్ 5 ఫేమ్ ప్రియ హాట్ సెల్ఫీ

తెలుగు బిగ్ బాస్ 5 తో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న నటి ప్రియ ..తన బెడ్ రూమ్ లో ఒక హాట్ సెల్ఫీ వీడియో తీసుకొని వైరల్ గా మారింది. గత 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా ప్రియా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎలాంటి పాత్రలు చేసినా కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ఉంటారు. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి చెల్లెలిగా కూడా కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఈమె కు బిగ్ బాస్ సీజన్ 5 లో ఛాన్స్ రావడం అందరికి షాక్ కలిగించింది.

హౌస్ లో అడుగుపెట్టిన మొదట్లో కాస్త సైలెంట్ గా ఉన్న ప్రియ ఆ తర్వాత మెల్ల మెల్లగా అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చింది. అయితే యాంకర్ రవి తో మాత్రం ఆమె గొడవ పెట్టుకున్న విధానం హైలెట్ గా నిలిచింది. అంతేకాకుండా కాజల్ తో కూడా పలు సమయాల్లో సీరియస్ గా మాట్లాడటం కూడా హైలేట్ గా నిలిచింది. సన్నీ విషయంలో ప్రియ గొడవ పడడం..చెప్పలేని విధంగా కామెంట్స్ చేయడం ఆమెను హౌస్ నుండి బయటకు వెళ్లేలా చేసింది.

బిగ్ బాస్ నుంచి ఒక విభిన్నమైన తరహాలో బయటకు వచ్చిన ప్రియ మళ్ళీ వరుస సినిమాలతో బిజీ గా మారిపోయారు. ఇటీవల తన బెడ్ రూం లో ఒక హాట్ సెల్ఫీ వీడియో తీసుకున్నా ప్రియ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పోస్ట్ చేసింది. అందులో ప్రియా ఒక లాంగ్ బ్లాక్ డ్రెస్లో అందంగా కనిపించింది. పాతికేళ్ల అమ్మాయి తరహాలో ప్రియ చాలా అందంగా కనిపిస్తుందని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.