మళ్లీ కాంగ్రెస్ లోకి బండ్ల గణేష్…?

సినీ నిర్మాత , నటుడు బండ్ల గణేష్ మరోసారి కాంగ్రెస్ పార్టీ లోకి చేరబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన తన ట్విట్టర్ లో జై కాంగ్రెస్ అని ట్వీట్ చేయడమే కాదు , CLP నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొనబోతున్నట్లు తెలిపాడు. అంతే కాదు ఈ మధ్యే మల్లికార్జున ఖర్గే, డీకె శివ కుమార్ , రేవంత్ రెడ్డి ని కలిశారు. ఇవన్నీ చూస్తుంటే గణేష్ మళ్లీ కాంగ్రెస్ పార్టీ లో యాక్టివ్ కానున్నట్లు అర్ధమవుతుంది.

చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన గణేష్..ఆ తర్వాత అగ్ర నిర్మాతగా ఎదిగారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ , రామ్ చరణ్, రవితేజ వంటి అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం భారీ సవాళ్లు చేసాడు. కానీ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం తో సైలెంట్ అయ్యాడు. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపినప్పటికీ..ప్రస్తుతం మళ్లీ రాజకీయాల్లో బిజీ కావాలని చూస్తున్నట్లు అర్ధం అవుతుంది. మరి గణేష్ నిజంగానే కాంగ్రెస్ లో చేరతాడా..? లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.