భోళా శంకర్ టీజర్ విడుదల

భోళా శంకర్ టీజర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది. అలాగే సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర ఈ మూవీ ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసి అభిమానుల్లో అంచనాలు పెంచారు.

33 మందికి ఒక్కడే చంపేసాడు అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మెగాస్టార్ మెగా ఎంట్రీ ఇవ్వడం.. అక్కడ విలన్స్ తో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టాడు. షికారుకొచ్చిన షేర్ ని బే.. ‘ఏ భోళా ఇది నా ఏరియా అని విలన్ చెప్పగానే.. ఈ స్టేట్ డివైడ్ అయిన అందరు నావాళ్లే. నాకు హద్దులు లేవు. సరిహద్దులు లేవు..’ అంటూ మెగాస్టార్ తెలంగాణ యాసలో తనదైన స్టయిల్ లో అదరగొట్టాడు. మహాతి స్వర సాగర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది.

YouTube video