మంత్రి అనిల్ కు బండ్ల గణేష్ మాములు పంచ్ ఇవ్వలేదుగా..

బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో చెప్పాల్సిన పనిలేదు. పవన్ లో ఓ దేవుడ్ని చూసుకుంటారు. అలాంటి దేవుడ్ని ఎవరైనా ఓ మాట అంటే గణేష్ అస్సలు ఊరుకోరు. అవతలా ఏ స్థాయి వ్యక్తి అయినా సరే తాను చెప్పాలనుకున్నది చెపుతాడు..ఇవ్వాలనుకున్న పంచ్ ఇస్తాడు. తాజాగా వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అలాంటి పంచ్ వేసి పవన్ అభిమానుల్లో ఆనందం నింపారు.

ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్స్ అంశం వాడి వేడిగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం సినిమా టికెట్స్ ధరలే పెద్ద అంశం అన్నట్లు వాటిపై ఫోకస్ పెట్టారు. జీవో 35 ని తీసుకొచ్చి సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గించాడు. ఈ ధరలతో సినిమా థియేటర్స్ ను నడపలేమని థియేటర్ యజమానులు స్వచ్ఛదంగా తమ థియేటర్స్ ను క్లోజ్ చేస్తున్నారు. ఈ టికెట్ ధరల పట్ల సినీ నటుడు నాని వైసీపీ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

నాని కామెంట్స్ ఫై మంత్రి అనిల్ యాదవ్ స్పందిస్తూ..” నాకు నాని ఎవరో తెలియదు.. నాకు తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒక్కరే.. టికెట్ల రేట్ల మీద అంత బాధ ఉన్నహీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా.. ప్రజలను ఉద్దరిస్తానన్న పవన్.. తక్కువ రేట్ కు వినోదం పంచొచ్చు కదా.. గతంలో నేను కూడా నా బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ సినిమాలకు కటౌట్ లు కట్టి డబ్బులు పోగొట్టుకున్నా.. ఇప్పుడు పవన్ అభిమానుల పరిస్థితి అలాగే ఉందని ” చెప్పుకొచ్చారు.

ఇక ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ తనదైన మార్క్ పంచ్ వేస్తూ ట్వీట్ చేశాడు. “అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావ్ అన్నా” అంటూ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ అభిమానివి కాబట్టే ఇక్కడి వరకు వచ్చావ్ అనే అర్థంలో బండ్ల వేసిన కౌంటర్ కి పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.