తన ప్రమాణంతో సీఎం కేసీఆర్ కుటుంబం రాజకీయ చరిత్ర సమాధి కాబోతుంది – బండి సంజయ్

బండి సంజయ్ చెప్పినట్లే శుక్రవారం యాదాద్రి గుడిలో ప్రమాణం చేసారు. తన ప్రమాణంతో సీఎం కేసీఆర్ కుటుంబం రాజకీయ చరిత్ర సమాధి కాబోతుందన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే లను బిజెపి కొనుగోలు చేసేందుకు ట్రై చేసిందనే ఆరోపణలను బిజెపి కొట్టిపారేసింది. ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ బండి సంజయ్ ఓ సవాల్ విసిరారు. ఫామ్‌హౌస్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తాను యాదాద్రిలో ప్రమాణ స్వీకారం చేస్తానని.. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఆయన కూడా రావాలని ఛాలెంజ్ విసిరారు. బండి సంజయ్ విసిరినా సవాల్ ఫై కేసీఆర్ స్పందించనప్పటికీ..బండి సంజయ్ మాత్రం చెప్పినట్లే యాదాద్రి లో ప్రమాణం చేసారు.

యాదాద్రికి చేరుకున్న బండి సంజయ్ ముందుగా గుండంలో స్నానం చేసి తడి బట్టలతో ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి సన్నిధిలో తడి బట్టలతో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ తమది కాదని ఆయన స్వామివారి పాదాల దగ్గర ప్రమాణం చేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తప్పు చేశారు కాబట్టే గుడికి రాలేదని ఆరోపించారు. తాను చేసిన ప్రమాణంతో సీఎం కేసీఆర్ కుటుంబం రాజకీయ చరిత్ర సమాధి కాబోతోందని అన్నారు. ఈ కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం, వారికి మద్దతు తెలిపిన వారంతా దొంగలని ఫైర్ అయ్యారు.