ఈట‌ల ను ప‌రామ‌ర్శించిన బండి సంజ‌య్

పాద‌యాత్ర‌లో పాల్గొంటూ అస్వ‌స్థ‌త‌కు గురైన ఈట‌ల‌

హైదరాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో పాద‌యాత్ర‌లో పాల్గొంటూ అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న మొద‌ట హైద‌రాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అనంత‌రం అక్క‌డి నుంచి ఆయ‌న‌ను జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

అపోలోకు వ‌చ్చిన‌ బీజేపీ తెలంగాణ‌ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేత‌ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్.. ఈట‌ల‌ను ప‌రామ‌ర్శించారు. ఈటల ఆరోగ్య ప‌రిస్థితి గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈటల ఆరోగ్యం కుదుట‌ప‌డ్డాక.. త‌న పాదయాత్ర‌ వాయిదాపడ్డ గ్రామం నుంచే ఈటల తిరిగి ప్ర‌జా దీవెన యాత్ర‌ను ప్రారంభిస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. హుజూరాబాద్‌లో ఇత‌ర బీజేపీ నేత‌లు చేస్తోన్న ప్ర‌చారం మాత్రం కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/