అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి

టెక్సాస్‌ యూనివర్సిటీలో కాల్పులు..మృతులు ఎవరన్నది అస్పష్టం

Texas university
Texas university

టెక్సాస్‌: మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం జరిగింది. టెక్సాస్‌లోని ఏఅండ్ఎం యూనివర్సిటీకామర్స్ క్యాంపస్‌లోని రెసిడెన్స్ హాల్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వీరు విద్యార్థులా? కాదా? అన్న విషయం తెలియరాలేదు. కాల్పుల సమయంలో గదిలో ఉన్న చిన్నారి ఒకరు గాయపడినట్టు యూనివర్సిటీ పోలీస్ చీఫ్ బ్రయన్ వాన్ తెలిపారు. లైసెన్స్ ఉన్న వ్యక్తే కాల్పులకు తెగబడ్డాడని, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. కాగా, యూనివర్సిటీలో మొత్తం 1600 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా
కాల్పుల నేపథ్యంలో క్యాంపస్‌కు సెలవు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/