హైదరాబాద్ నగరశివార్లో మహిళపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లో మరోసారి గ్యాంగ్ రేప్ సంచలనంగా మారింది. హైదరాబాద్ నగరశివార్లో మహిళా ఫై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన చోటుచేసుకుంది. దుండిగల్ లో మహిళపై నలుగురు దుండగులు శుక్రవారం అర్ధరాత్రి సామూహిక అత్యాచారం జరిపారు. సోలాపూర్ నుంచి రెండు రోజుల కిందట దుండిగల్ కు వచ్చిన ఓ మహిళను శుక్రవారం గండిమైసమ్మ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశం లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపారు.

స్థానికుల సమాచారం తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. బాధితురాలి నుండి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసారు. అత్యాచారానికి పాల్పడ్డ నరసింహ, ఇమామ్, కుద్దుసు, ఉమృ దీన్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దుండిగల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే బస్తీవాసులు గా గుర్తించారు. వీరంతా కూడా ఆటో డ్రైవర్లు గా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాధితురాలిని హాస్పటల్ లో చేర్పించారు.