బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన ఘటన ఫై బండి సంజయ్ దిగ్బ్రాంతి

ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసిన కొద్దీ దూరంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. దాదాపు 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఫై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను అన్ని విధాలా సాయం అందించాలన్నారు. బీఆర్ఎస్ నేతల ఆనందం కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన కొందరు కార్యకర్తలు సంతోషంలో పటాకులు పేల్చారని, దీంతో నిప్పు రవ్వలు ఎగిరి.. పక్కన ఉన్న ఓ గుడిసెలో ఉన్న సిలిండర్ పై పడడంతో అది పేలిందని అంటున్నారు. ఈ ప్రమదంలో స్పాట్ లో ఒకరు చనిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో వ్యక్తి చనిపోయారని తెలుస్తోంది. గాయపడ్డ వారిలో పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారని సమాచారం.