కేసీఆర్ కి ఈడీ దాడుల భయం పట్టుకుంది – బండి సంజయ్

bjp-state-president-bandi-sanjay-comments-on-cm-kcr

మరోసారి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్..ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ కి ఈడీ దాడుల భయం పట్టుకుందని..టీఆరెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు మందు కలపడానికి ప్రగతి భవన్ ముందు క్యూ కడుతారంటూ ఎద్దేవా చేసారు.

గత కొద్దీ రోజులుగా బండి సంజయ్ – కేసీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వరి కొనుగోలు విషయంలో కేంద్రం తీరు ఫై తెరాస ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా బాట పట్టారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తెరాస మంత్రులు , ఎమ్మెల్యే లు , నేతలు , రైతులు ధర్నాలు చేస్తూ కేంద్రం వరి కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు. ఈ క్రమంలో బండి సంజయ్ తెరాస తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

కేసీఆర్ కి రైతుల కోసం ఆందోళన చేసే సమయం ఉండదని… కేవలం టైం పాస్ చేయడానికే టైం కేటాయిస్తాడంటూ సంజయ్ ఫైర్‌ అయ్యారు. అందుకే ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడని… వర్షాలతో రైతులు భయపడుతుంటే ప్రభుత్వం ధర్నాలు చేస్తుందన్నారు. వానాకాలం పంట కొనుగోలు చేస్తార లేదా…? చెప్పాలని నిలదీశారు. అధికార పార్టీ ఆందోళనలు ఎందుకు చేశారో అర్థం కావడం లేదని…. టీఆరెస్ నేతలు రైతు సమస్యల పై ధర్నాలు చేస్తున్నారా…? లేక అంతర్జాతీయ సమస్య కోసమా…? అని నిలదీశారు. ధర్నాలకొచ్చిన వల్లే సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటున్నారు.. వాళ్ళు వాస్తవ విషయాలు తెలుసుకున్నట్లు ఉన్నారని తెలిపారు.

కేసీఆర్ కి ఈడీ దాడుల భయం పట్టుకుందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ని పార్టీలో మంత్రి కావాలనుకున్నవాళ్లు నీకు మందు పోస్తారు నాకేం అవసరమని ప్రశ్నించారు. మందు కలిపితే మంత్రి అవుతారని తెలిస్తే టీఆరెస్ ఎమ్మెల్యేలు మందు కలపడానికి ప్రగతి భవన్ ముందు క్యూ కడుతారంటూ ఎద్దేవా చేశారు.