ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ఒక్క రోజు మాత్ర‌మే..

నవంబర్ 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నట్లు గవర్నర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే ఈ అసెంబ్లీ స‌మావేశాలు నాలుగు లేదా ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ ఈ సమావేశాలు ఒక్క రోజు మాత్రమే జరుగబోతున్నట్లు తెలుస్తుంది.

డిసెంబర్ నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. డిసెంబ‌ర్ నెల చివ‌రి వారంలో కాని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రీ నెల‌లోని మొదటి వారంలో గానీ పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే న‌వంబ‌ర్ 18న జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ స‌మావేశాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందనేది చూడాలి.

ఈ అసెంబ్లీ స‌మావేశాల‌లోనే మండ‌లి ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ల‌ను కూడా ఎన్నుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి అసెంబ్లీ స‌మావేశాలు వాడీ వేడి గా సాగే అవకాశం ఉంది. ఇటీవ‌ల టీడీపీ జాతీయ కార్యల‌యం పై దాడి జ‌రిగింది. దీని పై చ‌ర్చించాల‌ని టీడీపీ ఎమ్మెల్యే లు ప‌ట్టు ప‌ట్టే అవకాశం ఉంది.