బిగ్ బాస్ నటరాజ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ

బిగ్ బాస్ ఫేమ్ నటరాజ్ మాస్టర్ కు నందమూరి బాలకృష్ణ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం బాలకృష్ణ ఓ పక్క సినిమాలు చేస్తూనే..తనలోని మరో యాంగిల్ ను బయటకు తీయబోతున్నారు. ఫస్ట్ టైం బాలకృష్ణ హోస్ట్ గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలయ్య ‘బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్’ పేరుతో హోస్ట్ చేయబోతున్నారు. న‌వంబ‌ర్ 4 నుండి షో స్ట్రీమింగ్ కానుంది.

ఈ షో కోసం బాలయ్య ఓ ఇంట్రడక్షన్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. దీనికి కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్యతో నటరాజ్ మాస్టర్ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరియోగ్రాఫర్‌గా సినిమాలు చేసిన నటరాజ్ మాస్టర్ ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొని నాలుగు వారాల పాటు హౌస్‌లో ఉన్నారు. ఎలిమినేట్ అయిన తర్వాత మళ్లీ నటరాజ్‌కి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య నుంచి బంపరాఫర్ అందుకున్నారు నటరాజ్. మరి ఈ ఇంట్రడక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. అలాగే ఈ షో మొదటి ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ రానున్నారని అంటున్నారు.