దేశంలో కొత్తగా 12,428 కరోనా కేసులు
ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 1,63,816
corona virus-india
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 12,428 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 356 మంది కరోనాతో మృతి చెందారు. 15,951 మంది కోలుకున్నారు.
ఇక తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,42,02,202కి పెరిగింది. మొత్తం 3,35,83,3018 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,55,068 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,63,816 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/