డీజీపీ గౌతమ్ సవాంగుకు చంద్రబాబు లేఖ

తమ కార్యకర్తకు ప్రాణహాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత..చంద్రబాబు


అమరావతి : చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి ఘటన పై టిటిడి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైస్సార్సీపీ నేతలు తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి డీజీపీ గౌతమ్ సవాంగుకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

మురళీకి ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు మురళికి రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. మురళిని కిడ్నాప్ చేసి కొట్టడమేకాకుండా.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. నిందితులను తక్షణమే పోలీసులు అరెస్ట్ చేయాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలంటు కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/