కమర్షియల్ యాడ్ లో అదరగొట్టిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైం కమర్షియల్ యాడ్ లో నటించి మెప్పించారు. ఇంతవరకు వెండితెర , బుల్లితెర ఫై సందడి చేసిన బాలకృష్ణ..ఇక ఇప్పుడు కమర్షియల్ యాడ్‌లలో కూడా దుమ్ముదులుపుతాడని నిరూపించారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సాయిప్రియ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం తెరకెక్కించిన యాడ్ లో బాలకృష్ణ ఆకట్టుకున్నారు. బాలకృష్ణ రేంజ్ కు తగ్గట్టు యాడ్ ను రూపొందించారు.

కొందరు నీళ్లలాగా పల్లానికి కాదు, రాకెట్ లా పైకి దూసుకపోతారు. ప్రపంచంతో నడవరు, ప్రపంచానికే నడక నేర్పిస్తారు. ఒంటరిగా గెలవడం కాదు, వెంటున్న అందర్నీ గెలిపిస్తారు. బంగారంలా తరిగిపోరు, వజ్రంలా వెలిగిపోతారు. లెజెండ్ లా నిలిచిపోతారు. ఆ కొందరిలో మీరు ఒకరైతే.. మీ కోసమే 116 పారామౌంట్, లివ్ లైక్ ఎ లెజెండ్, ఏ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు అఫ్ సాయి ప్రియా గ్రూప్’ అంటూ తనదైన స్టైల్ లో బాలయ్య చెప్పారు. అనంతరం ఓ చిన్నారి అట్టముక్కలతో ఇల్లు కట్టగా.. బాలకృష్ణ చప్పట్లతో అభినందిస్తారు. అంతలోనే గాలి వచ్చి.. ఓ అట్టముక్క పడిపోతుంది. దీంతో బాలయ్య చిరునవ్వు నవ్వి.. మరలా దానిని కట్టిస్తాడు. ‘బొమ్మరిల్లు ఎన్నిసార్లైనా కట్టుకోవచ్చు.. కానీ మనం కలలు కనే ఇల్లు జీవితంలో ఒకటే సారి కట్టుకుంటాం.. ఆ ఇల్లు నమ్మకం, నాణ్యత, నవ్యత, నిబద్దత అనే నాలుగు పటిష్టమైన స్తంభాలపైన నిలబడాలి.. అలా నిలబడిందే సాయి ప్రియ గ్రూప్’ అంటూ బాలకృష్ణ వెల్లడించారు. ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది.

సినిమాటిక్ స్టైల్ లో బాలయ్య డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సాయిప్రియ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కొత్తగా కట్టే ప్రాజెక్టు కోసం బాలయ్యతో యాడ్ చేశారు. యాడ్ లో పవర్ ఫుల్ గా బాలయ్య కనిపించారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ‘వీరసింహారెడ్డి’ చిత్రం చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ లో బాలకృష్ణ కు జోడి గా శృతి హాసన్ నటిస్తుంది. అలాగే బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్‌ను ఇటీవల ప్రారంభించాడు. మొత్తం మీద బాలయ్య బుల్లితెర , వెండితెర పైనే కాకుండా కమర్షియల్ యాడ్స్ లలో కూడా బిజీ గా ఉన్నారు.

YouTube video