‘చలో ఢిల్లీ’..ఢిల్లీ శివారుల్లోకి చేరిన రైతులు..

టియర్‌ గ్యాస్‌ ఉయోగించిన పోలీసులు

Delhi Chalo march Farmers

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘ చలో ఢిల్లీ’ నిరసన ర్యాలీ శుక్రవారమూ కొనసాగుతుంది. మార్చ్‌లో భాగంగా ఢిల్లీ సరిహద్దుకు చేరిన రైతులను చెదరగొట్టేందుకు ఢిల్లీ పోలీసులు శుక్రవారం టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. సరిహద్దుల్లో భారీగా చేరుకున్న రైతులు, బలగాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీని హర్యానాతో కలిసి సరిహద్దు పాయింట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని తెలిపారు. నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.

ఢిల్లీకి వచ్చేందుకు అనుమతి ఇవ్వడం లేదని, వచ్చేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. సరిహద్దు వద్ద భద్రతను బలోపేతం చేశామని, ఇసుకతో నింపిన ట్రక్కులు, వాటర్‌ కెనాన్‌లను అందుబాటులో ఉంచారు. అలాగే నిరసనకారులు రాజధానిలోకి రాకుండా నిరోధించేందుకు ముళ్లకంచెలను సైతం ఏర్పాటు చేశారు. 30కిపైగా రైతు సంఘాలు రైతులు లాల్రూ, శంభు, పాటియాలాపెహోవా, పత్రాన్‌ఖానౌరి, మూనక్‌తోహానా, రతియాఫతేహాబాద్‌, తల్వాండిసిర్సా తదితర మార్గాల ద్వారా ఢిల్లీ వెళ్తామని ప్రకటించారు. పెద్ద సంఖ్యలో రైతులు సరిహద్దులకు చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/