విజయ్ దేవరకొండ కు షాక్ ఇచ్చిన బాలకృష్ణ

లైగర్ సెట్ కు బాలకృష్ణ వచ్చి హీరో విజయదేవరకొండ – పూరి జగన్నాధ్ లకు షాక్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ మూవీ లైగర్. పూరీ కనెక్ట్స్ – ధర్మ క్రియేషన్స్ సంయిక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచానాలే ఉన్నాయి. కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడగ..తాజాగా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ సెట్ కు నందమూరి బాలకృష్ణ సడెన్ ఎంట్రీ ఇచ్చి చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చారు.

బాలకృష్ణ ను చూసిన చిత్ర యూనిట్ సంబరాలు చేసుకున్నారు. సినిమా తాలూకా వివరాలను డైరెక్టర్ పూరి ని అడిగి తెలుసుకొని , చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.