సోనియా కు తన రాజీనామా లేఖను పంపిన రాజగోపాల్ రెడ్డి

తన రాజీనామా లేఖ ను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు రాజగోపాల్ రెడ్డి. రెండు రోజుల క్రితం పార్టీ కి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి..ఈరోజు గురువారం తన రాజీనామా లేఖను సోనియా కు పంపారు. 30 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేశానన్నారు.. సోనియాపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగించడం బాధకలిగించిందన్నారు. ఎందరో త్యాగాలు..అందరి పోరాటంతో సాకారమైన తెలంగాణరాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో బంధీ అయిందని తెలిపారు.

ఈ బంధీ నుంచి విడిపించేందుకు తెలంగాణలో మరో ప్రజాస్వామ్య పోరాటం అవసరమన్నారు.అందుకే ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 8న రాజగోపాల్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు స్పీకర్. ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా ను అధికారికంగా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నేతలంతా ఆయనపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేయడం పట్ల రాజగోపాల్ అదే రేంజ్ లో విరుచుకపడ్డారు. ఇదిలా ఉండగానే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బిజెపి లో టచ్ లో ఉన్నారని చెప్పడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఏంజరుగుతుందో చూడాలి.