గణేష్ మాస్టర్ తో కలిసి రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్స్

RRR తో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పలు భాషల్లో తెరకెక్కుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా చిత్రంలోని ఓ పాటకి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియో గ్రఫీ అందిస్తున్నాడు. కాగా ఈ పాట షూట్ గ్యాప్ లో గణేష్ మాస్టర్ తో కలిసి రామ్ చరణ్ ‘మైన్ ఖిలాడీ తు అనారి’ అనే బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌కు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఇక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘RC15’మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్ లుక్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్.జే సూర్య, సునీల్ , శ్రీకాంత్ , అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు.