తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి బాలకృష్ణ

స్టార్ క్యాంపెయినర్ల జాబితా సిద్ధం

Bala Krishna
Bala Krishna

Amaravati: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా ఆ పార్టీ నేత, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొననున్నారు . ఈ మేరకు చంద్రబాబుతో సహా మరో 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను సిద్ధం చేసిన టీడీపీ దానిని ఎన్నికల సంఘానికి పంపింది. ఆ జాబితా లో చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ సహా 9 మంది పొలిట్ బ్యూరో సభ్యులు, ఐదుగురు ఎం పీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/