ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన బాలయ్య

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం నుండే అభిమానులు , కార్య కర్తలు , కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్య లో హాజరై , ఎన్టీఆర్ ఘాట్ కు నివాళ్లు అర్పిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లా నిమ్మకూరులో నందమూరి అభిమానులు , టీడీపీ శ్రేణులు శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు నిమ్మకూరు వచ్చిన ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఎప్పటికీ ఉంటాయన్నారు. తెలుగువారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలన్న ఆయనకు వందనాలని బాలకృష్ణ పేర్కొన్నారు.