ప్రధాని మోడి ట్విట్టర్‌ నుంచి మహిళల ట్వీట్లు

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడి ట్విట్టర్‌ ఖాతా నుంచి పలువురు మహిళలు ట్వీట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాను ఆదివారం తన ట్విట్టర్‌ ఖాతాను మహిళలకు ఇచ్చేస్తానంటూ ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో #SheInspiresUs ట్యాగ్‌తో కొందరు మహిళలు చేస్తోన్న ట్వీట్లు ఆయన ట్విట్టర్ ఖాతాలో కనపడుతున్నాయి. మోడి ట్విట్టర్‌ ఖాతాలో తొలి ట్వీటును చెన్నైకి చెందిన స్నేహ మోహన్‌దాస్ అనే మహిళ చేసింది. పేదల అకలి బాధలు తీర్చేందుకు ఆమె ‘ఫుడ్‌ బ్యాంక్’ సంస్థను స్థాపించి సేవలందిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/