ఎంపీ పదవికి బాబుల్‌ సుప్రియో రాజీనామా

న్యూఢిల్లీ: నెల రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బాబుల్‌ సుప్రియో..తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అందజేశారు. పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌ నియోజకవర్గం నుంచి ఈయన రెండు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/