బాహుబలి దర్శకుడు రాజమౌళి కాదండోయ్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలసిందే. ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో పెద్ద సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విధానంతో ప్రేక్షకులు థియేటర్లలో బారులు తీరారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. అయితే తాజాగా ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి కాదనే విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపించిన బాహుబలి చిత్రాన్ని వెబ్ సిరీస్‌గా రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్ రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం చేసే బాధ్యతలను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశ్వేశ్ కృష్ణమూర్తికి అప్పగించారట. వెబ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా బాహుబలి వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు విశ్వేశ్ రెడీ అవుతున్నాడట. థియేటర్లలో ఈ వెబ్ సిరీస్ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో, ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా కూడా అంతే విధ్వంసాన్ని సృష్టించేందుకు రెడీ అవుతోంది. బాహుబలికి ఉన్న క్రేజ్‌ను ఏమాత్రం తగ్గకుండా మరింత పెరిగేలా వెబ్ సిరీస్ నిర్వాహకులు పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నారట.

అయితే ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాహుబలి వెబ్ సిరీస్‌కు సంబంధించిన స్క్రిప్టును రాజమౌళికి వినిపించాక, ఆయన ఓకే అన్న తరువాతే ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి బాహుబలి దర్శకుడు రాజమౌళి కాకుండా వేరొకరు తెరకెక్కిస్తే అది ఎలా ఉంటుందా అనే ప్రశ్న ప్రస్తుతం బాహుబలి అభిమానుల్లో నెలకొంది. ఈ వెబ్ సిరీస్‌ను అతి త్వరలో పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.