త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తా : ఆనందయ్య

పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని విమర్శ
బీసీ జేఏసీని కలుపుకుని కొత్త పార్టీ పెడతామని వెల్లడి

అనకాపల్లి: కరోనా వైరస్‌కు మందు పంపిణీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కూడా అయిన ఆనందయ్య నిన్న విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. బీసీ జేఏసీని కలుపుకుని త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తామని తెలిపారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు కూడా తన వద్ద మందు ఉందని, ప్రభుత్వం కనుక సహకరిస్తే ఆ మందును ప్రజలకు పంపిణీ చేస్తానని ఆనందయ్య పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/