వచ్చే సంవత్సరం సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

సెలవుల్లో మార్పులు ఉంటే పత్రికా ప్రకటన ద్వారా ముందే తెలియజేస్తామన్న ప్రభుత్వం

అమరావతి: ఏపీ ప్రభుత్వం 2022కు సంబంధించిన ప్రభుత్వ సెలవుల విడుదల చేసింది. మొత్తం 23 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించగా, 21 రోజులను ఐచ్ఛిక సెలవులుగా నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఐచ్ఛిక సెలవుల్లో 9 ఆదివారం రోజే రావడం ఉద్యోగులకు నిరాశ కలిగించింది.

కనుమ, శ్రీరామనవమి, బక్రీద్, గాంధీ జయంతి, మిలాద్-ఉన్-నబీ, క్రిస్‌మస్‌ వంటి సాధారణ సెలవులు, మహాలయ అమావాస్య, నరక చతుర్దశి, యాజ్‌–దహుం–షరీఫ్‌ వంటి ఐచ్ఛిక సెలవులు కూడా ఆదివారమే రావడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తిథుల ప్రకారం నిర్వహించే హిందూ పండుగలతోపాటు అప్పటికప్పుడు నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహరం, మిలాద్-ఉన్-నబీ వంటి పండుగల్లో మార్పులు అవసరమైతే కనుక పత్రిక ప్రకటన ద్వారా ముందుగానే తెలియజేస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వల్లో పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/