శాంసంగ్ ఇండియా తో కలిసి యాక్సిస్ బ్యాంకు కో-బ్రాండెడ్ వీసా కార్డు

ఇండియా లో వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల దిగ్గజం శాంసంగ్ ఇపుడు దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకు యాక్సిస్ బ్యాంకు భాగస్వామ్యం తో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ను వీసా సహకారంతో విడుదల చేయటం జరిగింది.. కాగా, ఈ శాంసంగ్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు తో ఆయా వినియోగ దారులు శాంసంగ్ ఉత్పత్తులు అన్నింటిపై , అంతేకాకుండా సర్వీస్ పై 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు.. వినియోగదారులకు మరింత సంతోషం కల్గించేలా ఈ 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ను శాంసంగ్ ప్రస్తుతం ఇస్తున్న ఆఫర్లకు అదనంగా ఈఎంఐ ఆఫర్లపై ఈ శాంసంగ్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు అందిస్తుంది..

ఈ సందర్భంగా శాంసంగ్ , సౌత్ -వెస్ట్ అధ్యక్షుడు , సీఈఓ కెన్ కాంగ్ మాట్లాడుతూ శాంసంగ్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఇపుడు శాంసంగ్ ఉత్పత్తులను వినియోగ దారులు కొనుగోలు చేస్తున్న తీరును మార్చనుందని అన్నారు . మారుతున్న అవసరాలను తీర్చటంతో పాటు సౌకర్యవంతమైన అనుభవాలను అందించటంపై దృష్టి సారించామని అన్నారు.. ఈ కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ను శాంసంగ్ ఇండియా , వీసా భాగస్వామ్యంతో విడుదల చేసినట్టు తెలిపారు. భారత దేశంలోని 10 నగరాలతో పాటు టియర్ 2,3 నగరాల్లో సైతం ఈ సేవలను అందించనున్నామని యాక్సిస్ బ్యాంకు ఎండి, సీఈవో అమితాబ్ చౌదరి అన్నారు. కార్యక్రమంలో వీసా ఇండియా అండ్ సౌత్ ఆసియా గ్రూప్ కంట్రీ మేనేజర్ సందీప్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/