దేశంలో కొత్తగా 4,129 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కొత్తగా 4 వేలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం నాడు దేశవ్యాప్తంగా మొత్తం 4,129 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,72,243కు చేరింది అలాగే ఇరవై మంది కరోనా కారణంగా కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,28,530కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 0.10 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 98.72గా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/