ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నిక

అమరావతిః ఏపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కొలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు అసెంబ్లీ మూడోరోజు సమావేశం ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎన్నికను చేపట్టారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్నికకు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దాంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
కాగా, డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయిన కొలగట్లను సీఎం జగన్, టిడిపిఎల్పీ లీడర్ అచ్చెన్నాయుడు సభాపతి స్థానానికి తీసుకొని వెళ్లారు . ఏకగ్రీవంగా ఎన్నికయిన డిప్యూటీ స్పీకర్‌ను అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభినందించారు. ఇటీవలి వరకు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కోన రఘుపతి పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/