అవతార్ 2 బిగ్ షాక్…ఫుల్ మూవీ లీక్

యావత్ సినీ లవర్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అవతార్ 2 మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ విడుదలకు ముందే పైరసీ లీక్ అవ్వడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్‌ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవతార్‌ సినిమా ఏ రేంజ్‌లో రికార్డులు సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలో విహరింపజేసిన అవతార్‌ సినిమా సీక్వెల్స్‌తో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాను గతవారం లండన్, న్యూయార్క్ నగరాల్లో సినీ ప్రముఖులకు ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఇక మనదేశంలో బాలీవుడ్ ప్రముఖులకు రెండు రోజుల క్రితం సినిమాను ప్రదర్శించారు. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటె ఈ సినిమా మరికొద్ది సేపట్లో థియేటర్స్ లలో సందడి చేస్తుందనగా ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియాలో లీక్ చేయడం సంచలనంగా మారింది. ఈ సినిమా పైరసీ కాపీ టెలిగ్రామ్‌లో లీక్ చేశారు. దాంతో ఈ సినిమా రికార్డుస్థాయిలో పైరసీ జరిగిందనే విషయం సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. అవతార్ సినిమా హిందీ వెర్షన్ కాపీ ప్రస్తుతం టెలిగ్రామ్‌లో వైరల్ అయింది. ఈ సినిమా హిందీ వెర్షన్ పైరసీ కాపీ లింక్స్ టెలిగ్రామ్ యాప్‌లో లభ్యమవుతున్నట్టు సమాచారం. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా లీక్ కావడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.