మద్యం దుకాణాల లైసెన్సుల గడువు పెంపు

హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ-4 మద్యం దుకాణాల లైసెన్సులను ప్రభుత్వం పొడిగించింది. వచ్చే నెలాఖరుతో గడువు దుకాణాల గడువు ముగియాల్సి ఉన్నది. ఈ క్రమంలో నవంబర్‌ 1 నుంచి 30వ తేదీ వరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మద్యం పాలసీపై విధి విధానాలు రూపొందించేందుకు ఆబ్కారీశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. 2021-22 సంవత్సరానికి వైన్స్‌, బార్‌ లైసెన్స్‌లకు సంబంధించిన నిబంధనలు తయారు చేయాలని సూచించారు.

కాగా, ప్రభుత్వం మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పథకంలో రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వ్యాపార, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే గతంలో గీత కార్మికులకు సైతం మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2021-23 సంవత్సరంలో రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/