అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

ఇటీవల కోర్టులో బెయిల్ పిటిషన్

acham naidu
acham naidu

అమరావతి: ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన టిడిపి నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను హైకోర్టు కొట్టేసింది. అలాగే, ఈ కేసులో సంబంధం ఉన్న ఇతరులు వేసుకున్న అన్ని బెయిల్‌ పిటిషన్‌లను కూడా కొట్టేసింది. బెయిల్‌ పిటిషన్లు వేసుకున్న వారిలో రమేశ్ కుమార్, మురళీ, సుబ్బారావు కూడా ఉన్నారు. సుమారు 150 కోట్ల రూపాయల అవినీతిలో వాటాలపై సమాచారం సేకరించేందకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. గతంలోనూ తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్లు పెట్టుకోగా కోర్టు వాటిని అప్పట్లోనే కొట్టివేసింది. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/