నేడు బ్యాంకు అధిపతులతో ప్రధాని భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు బ్యాంకింగ్ అధిపతులు, ఎన్‌బీఎఫ్‌సీ సారథులతో భేటీ కానున్నారు. రుణ ఉత్పత్తులు, సమర్ధ పంపిణీ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆర్థిక సాధికారత,ఆర్థిక రంగం స్థిరత్వం ,సుస్థిరతలకు ముందుచూపుతో కూడిన వివేకవంతమైన విధానాలు వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చించనున్నారు. ఎం.ఎస్.ఎం.ఇలతో సహా మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, స్థానిక తయారీ రంగానికి ఫైనాన్సింగ్ వంటివాటి ద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో బ్యాంకింగ్ రంగం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆర్థిక సాధికారత సాధించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా పాల్గొననున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/