5 రాష్ట్రాల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయని సీఈసీ స్పష్టం చేసింది. దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు కేసులు పెరగడంతో ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పష్టత ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

కాగా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూలు జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి వల్ల ఎన్నికలను ఒకటి లేదా రెండు నెలలు వాయిదా వేయాలని అలహాబాద్‌ హైకోర్టు ఇటీవలే ఈసీని కోరింది. ఎన్నికల సభలు, ర్యాలీలు నిషేధించాలని కూడా కేంద్రాన్ని అభ్యర్థించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/