అమెరికాలో కాల్పుల కలకలం

cathedral-church

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో మరోసారి కాల్పుల కలకలం చేలరేగింది. క్రిస్మస్‌ను సందర్భంగా ప్రఖ్యాత కెథడ్రల్‌ చర్చిలో ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడు దాదాపు 20 సార్లు కాల్పులు జరపడంతో అక్కడి వారంతా భయాందోళనతో పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిని కాల్చి చంపారు. పోలీసులు వెంటనే స్పందించడంతో ప్రాణనష్టం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/