తొలిద‌శ వాణిజ్య ఒప్పందంపై చర్చలు

ఫోనులో మాట్లాడుకున్న అమెరికాచైనా విదేశాంగ మంత్రులు

China-america
China-america

అమెరికా: గత కొద్ది రోజులుగా అమెరికా-చైనా మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలసిందే. వాణిజ్య ఒప్పందం, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇటీవల ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. తాజాగా, అమెరికా-చైనా విదేశాంగ మంత్రులు ఫోన్‌లో చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య దిగుమతులు, ఎగుమతుల అంశంపై ఒప్పందాన్ని కొనసాగించేందుకు అంగీకరించారు. ఈ చర్చల్లో అమెరికా డిమాండ్లకు చైనా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇటీవల చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికల నేపథ్యంలో డ్రాగన్ వెనక్కు తగ్గి అమెరికాతో చర్చలు జరిపింది. తొలిద‌శ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు ఈ ఏడాది జనవరిలోనే సంత‌కాలు చేసినప్పటికీ అనంతరం చైనాలో కరోనా వైరస్ గురించిన వార్తలు బయటకు రావడం, అమెరికాలో తీవ్ర స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందడం వంటి పరిణామాలు ఆ ఒప్పందాన్ని ముందుకు కదలనివ్వలేదు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/