ఎలక్షన్‌ కమిషనర్‌ పదవికి అశోక్‌ లావాసా రాజీనామా!

ఎలక్షన్‌ కమిషనర్‌ పదవికి అశోక్‌ లావాసా రాజీనామా!
Ashok Lavasa

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా తన పదవికి రాజీనామా చేశారు. లావాసా తన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించినట్లు సమాచారం. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదిస్తే ఆగస్టు 31 నుంచి ఆయన విధుల నుంచి రిలీవ్‌ కానున్నారు. లావాసా పదవీకాలం అక్టోబర్‌ 2022 వరకు ఉంది. తదుపరి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ కావడానికి ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఏడీబీ వైస్‌ ప్రెసిడెంట్‌గా లావాసా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న దివాకర్‌ గుప్తా స్థానాన్ని లావాసా భర్తీ చేయనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/