టిఆర్ఎస్ పార్టీ తీరు ఫై ఎంపీ అర్వింద్ సెటైర్

అధికార పార్టీ టిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యే లను బిజెపి కొనుగోలు చేసేందుకు ట్రై చేసిందనే ఆరోపణలఫై బిజెపి ఎంపీ అర్వింద్ సెటైర్లు పేల్చారు. మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన నలుగురు ఎమ్మెల్యేల కథ ఒక కామెడీ సీన్లా ఉందని , సీరియస్ సినిమా మధ్య వచ్చే కామెడీ బిట్ లెక్క ఉందని సటైర్ వేశారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరిది కూడా గెలిచే ముఖం కాదన్న అర్వింద్.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎన్నడూ కండువా కప్పదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరాలనుకునే సిట్టింగ్ లు పదవికి రాజీనామా చేసి తనకుగానీ, బండి సంజయ్ కు గానీ అప్లికేషన్ పెట్టుకుంటే సర్వే చేసి టికెట్ ఇస్తామని తేల్చిచెప్పారు.

వ్యవసాయం, మౌళిక పరిశ్రమల అభివృద్ధికి లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నా కేసీఆర్ రైతుల కోసం కేంద్రాన్ని నిధులు ఎందుకు అడగడం లేదని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇయ్యలేదని విమర్శించారు. ఉప ఎన్నిక రావడంతో మునుగోడుకు అదిస్తాం, ఇదిస్తామంటున్న కేసీఆర్ ఇన్ని రోజులు ఎందుకివ్వలేదని నిలదీశారు. మునుగోడులో బీర్లు, బిర్యానీలు పంపిణీ చేస్తూ, స్కూళ్లు, కాలేజీల్లో పురుగుల భోజనం పెడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లు అందలేదన్న ఆయన.. రైతుకు రుణమాఫీ కూడా చేయలేదని చెప్పారు. లక్ష రుణమాఫీ చేస్తమని గొప్పలు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు పనికిమాలిన కామెడీ షోలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు పేరుతో అన్నీ బంద్ చేసిన టీఆర్ఎస్ సర్కారు ఉచిత ఎరువులు, పంటలకు ఎంఎస్పీ కల్పిస్తామన్న హామీలను నెరవేర్చలేదని అన్నారు.