ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనతే కారణం

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శ

Raghuram Rajan
Raghuram Rajan

ముందుచూపు లేకపోవడం, నాయకత్వలేమి వంటివి .. దేశంలో ప్రస్తుత పరిస్థితికి కారణమని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనతే కారణమని ఆయన ఆరోపించారు. వైరస్‌పై మనం విజయం సాధించాం.. అంటూ ప్రకటనలు గుప్పిం చారని అన్నారు. వ్యాక్సినేషన్ మందకొడిగా సాగటం కూడా వైరస్ వ్యాప్తికి కారణాల్లో ఒకటని అన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/