అనారోగ్యానికి గురైన అరియానా

బిగ్ బాస్ ఫేమ్ అరియానా..అనారోగ్యానికి గురైంది. అరియానా చేతికి సిరంజి స్టిక్కర్ ఉండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బిగ్ బాస్ షో తో విపరీతంగా క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ..ఆ తర్వాత వర్మ తో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత పాపులర్ అయ్యింది. అప్పటినుంచి టీవీ షో లతో బిజీగా ఉండే ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది.

తాజాగా ఆమె అనారోగ్యం బారిన పడినట్లు ఆమె షేర్ చేసిన వీడియో చూస్తే అర్ధమవుతుంది. చాలా రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతున్నాను అని వీడియో లో తెలిపింది.ఈ వీడియోలో అరియానా చేతికి సిరంజి స్టిక్కర్ ఉండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది.