రాములవారి భక్తులకు విజ్ఞప్తి

కళ్యాణంను టీవీ లో వీక్షించండి.

indrakaran reddy
indrakaran reddy

హైదరాబాద్; రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ ఉగాది పంచాంగ శ్రవణానికి ఎవరుకూడా ఆలయాలకు వెళ్లవద్దని, అలాగే శ్రీరాముల వారి కళ్యాణం కూడా టీవీ ఛానెళ్లలో వీక్షించాలని సూచించారు. ఈ సారి రాములవారి కల్యాణానికి భక్తులు ఎవరిని కూడా అనుమతిండం లేదని , కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొంటారని అన్నారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న భక్తులకు స్వామి వారి తలంబ్రాలు పంపిస్తామని తెలిపారు. భక్తులు దీనికి సహకరించాలని మంత్రి కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి;https://www.vaartha.com/news/national/